GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్ట్ యార్డును ఢిల్లీ నుంచి వచ్చిన బృందం సందర్శించింది. ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను సమీక్షిస్తూ వర్మీ కంపోస్ట్, ఆర్గానిక్ యూనిట్లు, కోకో పిట్ కేంద్రం, ఎన్టీపీ ప్లాంట్ పనితీరును పరిశీలించింది. సంబంధిత వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.