HYD: మహానగరంలో అత్తాపూర్, అఫ్జల్గంజ్, రాజేంద్రనగర్, మైలార్దేవ్ పల్లి, పాతబస్తీ ఏరియాలో కల్తీ పదార్థాల తయారీకి అడ్డాగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల వ్యవధిలో కల్తీ పదార్థాలు పట్టుబడ్డ వాటిల్లో అత్యధికంగా ఈ ప్రాంతాలు ఉన్నట్లు అధికారిక యంత్రం గుర్తించింది. ఈ ప్రాంతాలను ఎంచుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి..? అనే దాని పై విచారణ సాగుతోంది.