NLR: ఇందుకురుపేట మండలంలోని మైపాడులో కొందరు యువకులు వ్యాపారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి బుధవారం తెలిపారు. కటారి తరుణ్, మేకల సునీల్, బతాని నరేంద్ర, ఎస్.కే. అల్తాఫ్ సెంటర్లో బైక్ హారన్లతో స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తుండగా మందలించడంతో వారు దాడి చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు.