ప్రకాశం: బేస్తవారిపేటలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్సై రవీంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలోని నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు స్వచ్ఛందంగా మూసివేసినట్లు తెలిపారు.