అన్నమయ్య: రాజంపేట మండలం DBNకి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన వివాదంతో మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన యువతితో ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అతను ఆమె మరో యువకుడితో చనువుగా ఉందని ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు అనిల్‌పై దాడి చేయగా.. అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొన్నారు.