వనపర్తిలో ఆహా హోటల్‌పై మంగళవారం అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో డిప్యూటీ తహసీల్దార్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. హోటల్లో వినియోగిస్తున్న మూడు డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.