AKP: సబ్బవరం మండలం గుల్లేపల్లి పీహెచ్సీలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బి.సూర్యకుమారి మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ దమయంతి, సర్పంచ్ మంగ పాల్గొన్నారు.