»Wrestling Federation Of India Membership Cancelled By Uww
WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం రద్దు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.
Wrestling Federation of India membership cancelled by uww
డబ్ల్యుఎఫ్ఐ(WFI) వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీనివల్ల దాని ఎన్నికలు పలు మార్లు వాయిదా పడ్డాయి. అయితే ఇండియా రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన ఫెడరేషన్ జూన్ 2023లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ భారతీయ రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర విభాగాల నుంచి ఎదురైన న్యాయపరమైన పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడ్డాయి.
దీంతో యూడబ్ల్యుడబ్ల్యు(UWW) ప్రపంచ రెజ్లింగ్ పాలక మండలి.. డబ్ల్యుఎఫ్ఐ(WFI) తన ఎన్నికలను సకాలంలో నిర్వహించనందుకు సస్పెండ్ చేసింది. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ చేయడానికి భారత ఆటగాళ్లను అనుమతిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక ప్యానెల్ ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువును విధించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
డబ్ల్యుఎఫ్ఐ గవర్నింగ్ బాడీలోని 15 స్థానాలకు ఎన్నికలు ఆగస్టు 12న జరగాల్సి ఉంది. సోమవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ సింగ్‌తో సహా నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. న్యూఢిల్లీలోని ఒలింపిక్ భవన్లో అధ్యక్షుడి పోటీ కోసం జరగాల్సి ఉంది. చండీగఢ్ రెజ్లింగ్ సంస్థకు చెందిన దర్శన్ లాల్ ప్రధాన కార్యదర్శి పదవికి నామినేట్ కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్పీ దేస్వాల్ బ్రిజ్ భూషణ్ క్యాంప్ నుండి కోశాధికారిగా నామినేట్ అయ్యారు. WFI రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ నిర్వహిస్తోంది.