ATP: పదో తరగతి పరీక్షల వేళ ఫోన్ చూడొద్దు అని మందలించడంతో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండలం గుండ్లపల్లి కాలనీకి చెందిన మాధవి(15) రీల్స్ చూస్తుండగా తల్లిదండ్రులు మందలించారు. పరీక్షలకు చదువుకోవాలని సూచించారు. మనస్తాపానికి గురైన బాలిక విష గులికలు తీసుకోవడంతో చనిపోయింది.