TG: హనుమకొండ జిల్లా కడిపికొండలో తండ్రి రాజశేఖర్(54), కుమార్తె రాజశ్రీ(24) అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యారు. ఇవాళ తెల్లవారుజామున రాజశేఖర్ మంటల్లో చిక్కుకోగా, ఆయనను కాపాడే ప్రయత్నంలో కూతురు కూడా మరణించింది. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మరణానికి గల అసలు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.