నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. కాగా.. పంచరెడ్డి సురేష్ భార్య అనిత 16వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే.