భారత ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను నియమించనుంది. దిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో సచిన్‌తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా ఓటింగ్‌పై సచిన్ మూడేళ్ల పాటు అవగాహన కల్పించనున్నారు. 2024 లోక్ సభ ఎన్నిక(Lok Sabha Election)ల్లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం (Election Commission) తెలిపింది. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ పట్ల ఉన్న ఉదాసీనతలో మార్పు తీసుకురావడానికి ఈసీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని, అంతకంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, నటుడు అమీర్ ఖాన్(Aamir Khan), మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌లను ప్రచారకర్తలుగా నియమించింది.యువతలోనూ సచిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రికెట్ గాడ్ క్రేజ్‌ను ఉపయోగించి ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ లెజండరీ క్రికెటర్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించనుంది.