Governor Asked Detail Report To CS, DGP Of Meerpet Incident
Meerpet: మీర్ పేటలో (Meerpet) ఓ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఘటనపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. ఘటనకు సంబంధించి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లాలని.. ఆమె కుటుంబానికి సహాయ, సహకారాలు అందజేయాలని కోరారు.
హైదరాబాద్ లాల్ బజార్‌కు చెందిన బాలిక పేరంట్స్ ఇదివరకే చనిపోయారు. 15 రోజుల క్రితం తన తమ్ముడితో కలిసి మీర్ పేటలో సమీప బంధువు వద్దకు వచ్చారు. అక్కడే పనిచేస్తూ.. ఉంటున్నారు. దిల్ సుఖ్ నగర్లో ఓ వస్త్ర దుకాణంలో బాలిక పనిచేస్తోండగా.. ఆమె తమ్ముడు ప్లెక్సీలు కట్టేవాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఉండగానే గంజాయి తీసుకున్న నలుగురు లైంగికదాడికి తెగబడ్డారు.
ఆమె తమ్ముడు.. మరో ముగ్గురు చిన్నారులు ఉండగా ఇంట్లోకి వచ్చారు. అప్పటికే నిందితులు గంజాయి తీసుకున్నారు. బాలిక మెడపై కత్తి పెట్టి.. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగలిన వారు ఆమె తమ్ముడితోపాటు చిన్నారులను బెదిరించారు. పైకి వెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ.. ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడి చేశారు. బాలిక గట్టిగా కేకలు వేయగా.. వెళ్లిపోయారట. విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గవర్నర్ స్పందించగా.. నివేదిక తయారీలో పోలీసులు బిజీగా ఉన్నారు.