Elections : ప్రారంభం అయిన కౌంటింగ్.. ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు ఎవరంటే?
భారత దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం తొమ్మిది గంటల వరకు ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం.
Election Results : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభం అయ్యింది. ఈ మధ్యాహ్నానికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు దృష్ణ్యా ఆ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం మూడు గంటలకల్లా కౌంటింగ్ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ప్రణాళిక చేసుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం తొమ్మిది గంటలు దాటే సరికి అత్యధిక సీట్లలో తెలుగు దేశం పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అటు లోక్ సభ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రముఖుల విషయానికి వస్తే… పులివెందులలో కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేష్ తదితరులు వారి వారి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ, అమిత్‌షాలు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ముందంజలో ఉన్నారు. అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు సైతం ఆధిక్యంలో పయనిస్తున్నారు. వీరి గెలుపుపై మరి కొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది.