VZM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ దామోదర్ ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందిని కార్యాలయానికి పిలిపించుకుని, వారితో ముచ్చటించి మంగళవారం ఇప్తార్ విందును ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవ భవానికి ప్రతీక అని అన్నారు. మనమందరం భారతీయులం అని ఒకటే కులం, అది కూడా పోలీసు కులం అని ఆయన అభివర్ణించారు.