SKLM: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 39 గ్యాస్ ఏజెన్సీల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి 1-2 రోజుల్లోనే సిలిండర్ సరఫరా చేయబడుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని అధికారులు సూచించారు.