KMR: హనుమాన్ జయంతి రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని ఇవాళ అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం వాసులు కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో వసంతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం గురుస్వాములు అంబిలిపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.