»Rain Fury In Himachal Kills 71 Schools Closed 10 Thousand Crore Property Damage Cm Says
Rain Effect: వరద బీభత్సం 71 మంది మృతి..స్కూల్స్ బంద్
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Rain fury in Himachal kills 71, Schools closed, 10 thousand crore property damage CM says
Rain fury: ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు(Rain) విలయతాండవం సృష్టిస్తున్నాయి. హిమాచల్(Himachal Pradesh) ప్రదేశ్ వాసులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వరదల బీభత్సం కొనసాగుతోంది. గడిచిన 72 గంటల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారంటే దాని తీవ్రతను అర్థం చేసుకొవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని, కేంద్రం వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుక్కు(Sukhwinder Sukhu) విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇక పక్క రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్‌లో కూడా వరదలు ప్రళయం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 10 మంది వరకు మరణించారని తెలుస్తుంది. మంగళవారం సిమ్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. సిమ్లాలోని కృష్ణా నగర్లో కొండచరియలు విరిగిపడి ఐదు నుంచి ఏడు ఇళ్లు కూలిపోయాయి. తరచుగా కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు మూసుకుపోవడంతో ఆ ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలు బంద్ ప్రకటించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఈ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షపాతం 50 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. జులై నెలలో వరదలను మరవకముందే రాష్ట్రంలో మరోసారి వర్షాలు ముంచెత్తాయి. తాజా వరదలతో రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని(property damage) సీఎం సుఖ్విందర్ సుక్కు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల విలయం నుంచి కోలుకోవడానికి ఏడాది సమయం పడుతుందని సీఎం సుక్కు అంటున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. గత 3 రోజుల్లోనే 71 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. వరదలతో తల్లడిల్లుతున్న ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
సిమ్లాలోని సమ్మర్ హిల్స్‌లో వరుసగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. శిథిలాల కింద దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఎయిర్‌లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.