NRML: కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కడెం సర్పంచ్ దీకొండ విజయ్ హాజరై ప్రారంభించారు. అనంతరం వైద్యులను శాలువాలతో సత్కరించారు.