NRML: నర్సాపూర్ (జీ) మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో రూ. 12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ప్రొసీడింగ్ కాపీని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి గ్రామస్తులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖదీర్, ఉప సర్పంచ్ ప్రవీణ్, తదితరులు ఉన్నారు.