మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మోకాలికి ఆపరేషన్ జరిగింది. న్యూఢిల్లీలో ఆయన తన మోకాలికి చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఒక వారం రోజుల పాటు ఆయన న్యూఢిల్లీ(New Delhi)లోనే రెస్ట్ తీసుకుంటారని.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తారని మెగాస్టార్ పీఆర్ టీమ్ తెలిపింది కాగా, చిరంజీవికి ‘నీ వాష్’ సర్జరీ (Knee wash’ surgery) చేసినట్టు సమాచారం. ఈ శస్త్రచికిత్సను ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ అని కూడా అంటారట. అంటే, మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ శస్త్రచికిత్స (Surgery) ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారట. ఇది చిన్న శస్త్రచికిత్సే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో చేస్తారు. కాబట్టి, చిరంజీవికి వారం రోజుల విశ్రాంతి సరిపోతుంది.
ఇది చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇదిలా ఉంటే, చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్ (Bhola Shankar)’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా.. మూవీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా చతికిలపడింది. దీంతో మెగాస్టార్ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ నమోదైంది. ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘భోళా శంకర్’లో మెహర్ రమేష్ ఎలాంటి కొత్తదనాన్ని చూపించకపోవడం డిజాస్టర్‌కు ప్రధాన కారణం. దీనికి తోడు చిరంజీవి లాంటి సీనియర్ యాక్టర్(actor)తో వెకిలి కామెడీ చేయించడం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.