టమాట అయిపోయింది.. ఇప్పుడు అరటి పళ్ల వంతు వచ్చింది. బెంగళూరులో కేజీ అరటి పళ్లు రూ.100కు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగింది.
Banana: టమాట ధర అల్లాడించి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత ఉల్లి ఘాటు ఎలాగూ ఉండనుంది. ప్రతీ ఏటా సెప్టెంబర్ నెలలో ఉల్లి పోటు తప్పదు. ఐటీ హబ్ బెంగళూర్‌లో అరటిపండ్లకు క్రేజ్ ఎక్కువ. చిన్న షాపుల్లో కూడా అరటి పళ్లు (Banana) లభిస్తాయి. సో.. అక్కడ డిమాండ్‌కి సరిపడ అరటి పళ్లు లేవు. దీంతో కేజీ అరటి పళ్లు (Banana) రూ.100 పలుకుతోంది. దీంతో టమాట తర్వాత అరటి పళ్ల మోత మోగుతోంది.
బెంగళూరులో లభించే అరటి పళ్లలో (Banana) మెజార్టీ తమిళనాడు నుంచి వస్తాయి. ఎలక్కిబలే, పచ్ బలే రకం అరటి పళ్లను (Banana) బెంగళూర్ వాసులు ఇష్టపడి కొనుగోలు చేస్తారు. వీటిలో ఎలక్కిబలే రకం ధర ఎక్కువగా ఉంటుంది. తమిళనాడు నుంచి ఈ రకం పళ్ల రకం సప్లై తగ్గింది. నెలరోజుల క్రితం బిన్నిపేట మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల పళ్లు వస్తే.. అదీ 1000 క్వింటాళ్లకు పడిపోయింది. సో.. అరటి పళ్ల (Banana) రేటు అమాంతం పెరిగిపోయింది. బెంగళూర్‌కు వచ్చే పళ్లను తుమకూర్, రామనగర, చిక్ బళ్లాపూర్, అనేకల్, బెంగళూర్ రూరల్‌కు పంపిణీ చేస్తారు.
తమిళనాడులో గల హోసూర్, కృష్ణగిరి నుంచి కర్ణాటకకు అరటి (Banana) రవాణా అవుతోంది. సప్లై తగ్గడంతో ఎలక్కిబలే రకం కేజీ రూ.78, పచ్ బలే రకం రూ.18-20 పలుకుతోంది. ఖర్చులు కలుపుని వరసగా కేజీ రూ.100, రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. కొద్దీరోజుల్లో ఓనం, వినాయక చవితి, విజయ దశమి పండగలు వస్తున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఓ వ్యాపారి తెలిపారు. సో.. అరటి పళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం బెంగళూరులో మండిపోతున్నాయి. దాని ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో పడుతుందో లేదో చూడాలీ. పండగల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పళ్లు, పూల ధరలకు రెక్కలు వస్తాయి.