ADB: బేల మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో బీటీ రోడ్డు పనులను ప్రారంభించాలని ఐటీడీఏ డీఈ సతీష్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని కార్యాలయంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి ఆయన్ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ పనులను ప్రారంభించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.