TG: సీఎం రేవంత్ రెడ్డి చేసిన తొలి ఫైల్ ఏమైందని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. కుల, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామని తెలిపారు.