KMR: డ్వాక్రా సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై లింగంపేటలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.