TG: యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా కోసం కొత్త పట్టాదారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 28 నాటికి కొత్త పట్టాదారు పాస్ బుక్ పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.