TG: జగిత్యాల MLA సంజయ్ కుమార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయాలని కోరడం ఏంటని మండిపడ్డారు. ‘స్పీకరేమో సంజయ్ BRSలో ఉన్నారంటారు. ఈయనేమో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ఆఫర్ ఇస్తారు.. కాంగ్రెస్‌లోకి సంజయ్ రావడం వల్లే జిల్లాలో చిచ్చురేగింది’ అని ఆరోపించారు.