TG: మహిళలంటే బీఆర్ఎప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎందుకు అంత చిన్నచూపు అని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘మహిళలకు అండగా ఉండండి. ప్రతిసారి మహిళలను ఎగతాళి చేయడం పద్ధతి కాదు. తరతరాల అణిచివేత నుంచి మహిళలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మీ ప్రభుత్వ హయాంలో అభయహస్తం డబ్బులు మీరు వాడుకోలేదా? ప్రభుత్వాన్ని బదనం చేయడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.