NDL: కొలిమిగుండ్ల నూతన ఎస్సైగా షేక్ నగీన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన గోపాల్ శిక్షణ నిమిత్తం బదిలీ కావడంతో, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆమెను నియమించారు. సీఐ రమేశ్ బాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టిన నగీన, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.