PLD: నకరికల్లు మండలం చేజర్లలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీకలని అన్నారు.