WGL: నర్సంపేట పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్లో ఉద్యోగులు గత రెండేళ్లుగా రోజువారీ లావాదేవీల్లో నగదు తస్కరించి మొత్తం రూ.1.5 కోట్లు కాజేశారు. లెక్కల్లో తేడాలు గమనించిన యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల తీరుతో యాజమాన్యం తీవ్రంగా కలత చెందింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.