దేవర సినిమాలో సముద్ర వీరుడిగా భారీ యుద్ధాలు చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. రేపో మాపో మరో కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతున్నారు. అయితే ఈ షార్ట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం యంగ్ టైగర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ (koratala shiva) దర్శకత్వంలో దేవర సినిమా (Devara Movie) చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో సముద్రపు బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ముందుగా యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. నెక్స్ట్ జరుగనున్న షెడ్యూల్లోను యాక్షన్ ఎపిసోడ్‌నే షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ సెట్లో విజువల్ ఎఫెక్ట్స్ టీంతో కలిసి ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారట.
ఈక్రమంలో షార్క్‌తో భారీ ఫైట్ ప్లాన్ చేస్తున్నారట. ఇది సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఏదో హీరో ఎలివేషన్ కోసం కాకుండా.. దేవర(Devara) కథలో భాగంగా ఈ ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్(NTR) ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం వర్క్ షాప్ కూడా కంప్లీట్ చేశాడట. దీంతో దేవరపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ ఈ షార్ట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ ఓ కమర్షియల్ యాడ్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ యాడ్‌లో ఎన్టీఆర్ (NTR) కనిపించబోయే లుక్‌ని హెయిర్ స్టైలిష్ ‘ఆలిమ్ హాకిమ్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. Had an amazing time yesterday doing hair for our Man Of Masses @jrntr.. It is always fun shooting with @jrntr .. I love his high-octane and positive energy అని కోట్ చేస్తూ ఎన్టీఆర్ ఫోటోని పోస్ట్ చేసాడు. ఇందులో ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్‌తో చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఇంత స్టైలిష్‌గా కనిపించి చాలా రోజులే అయ్యింది. దాంతో యంగ్ టైగర్ స్టైలిష్ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇకపోతే దేవర సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.