AKP: అచ్యుతాపురం మండలం ఆవ సోమవరంలో సోమవారం ఉపాధి హామీ పథకంలో మంజూరైన మట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు చొరవతో రహదారి మంజూరైనట్లు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోలా మహేష్ తెలిపారు. రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.