KMM: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సోమవారం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో జరిపారు. ఆర్యవైశ్య సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. గ్రామ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కృష్ణారావు, మంగయ్య, లింగయ్య, నరేష్ పాల్గొన్నారు.