ప్రకాశం: పొన్నలూరు వ్యవసాయ అధికారి కార్యాలయంలోని AO రాము ఆధ్వర్యంలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంపై వ్యవసాయ అనుబంధ శాఖలతో కార్యచరణ జరిగింది. ఈ సమావేశంలో AO రాము మాట్లాడారు. ఆధునిక వ్యవసాయం చేసే విధంగా రైతులను తయారుచేయడం మన బాధ్యతని అధికారులకు చెప్పారు. రైతులందరూ కుటుంబ సర్వేలో పాల్గొని రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.