ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజవకర్గంలోనూ గెలవలేదని.. ఏ రోజూ ఎవరికీ సహాయం చేయలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాగా… ఆ వ్యాఖ్యలకు పేరు చెప్పకుండా చిరు స్మూత్ గా సమాధానం చెప్పారు.
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి నాతో క్లోజ్‌గా ఉంటూ కూడా.. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే.. అరె నిన్ననే కదా మనింటికి వచ్చారు. ఇంత ఇదిగా మాట్లాడితే ఎలాగా? నేను ఏ సహాయ సహాకారాలు చేయలేదా? ఎవరికీ హెల్ప్ కాలేదా? నేను ఎప్పుడు సాయం చేయలేదో నిరూపించమనండి. నా తృప్తి కోసం ఇచ్చాను.. దాన్ని పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ సహాయమే చేయలేదంటే…? ఓకే నీకంతే తెలిసింది! కానీ సహాయం చేసిన వారికి తెలుసు అది చాలు. నీకు తెలియక అన్నావో..తెలిసినా సరే అన్నావో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇలాంటి వారిని నేను కేర్ చేయను. ఎందుకంటే నా సమయం చాలా విలువైనది. నా మానసిక ప్రశాంతత మరింత విలువైంది. ఇప్పుడు నాకు శాంతి చాలా అవసరం. దానికోసమే నేను పరితపిస్తున్నా. వీళ్లు ఏదో అన్నారు కదా? అని నేను అశాంతికి గురవలేను’’ అని చిరంజీవి రోజాకి కౌంటర్ ఇచ్చారు.