ATP: అరటి పంటను ప్రభుత్వమే టన్ను రూ.15 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పండ్ల తోటల రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు నినదించారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.