RR: షాద్నగర్ పట్టణానికి చెందిన రంగస్థల నటులు రమేష్ బుల్లితెరపై తన ప్రతిభను చాటుకున్నారు. ఓ చానల్లో ప్రసారమయ్యే డైలీ సీరియల్లో నారద మహర్షి పాత్రలో నటించారు. పద్య నాటకల్లో రావణ, బస్మాసుర, వంటి వైవిధ్యమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందిన రమేష్ ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం పట్ల కళాకారులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.