JN: బొమ్మెర గ్రామంలో నిలిచి పోయిన అభివృద్ధి పనులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోతన స్మృతి వనాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుందని, వెంటనే స్మృతి వనం నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.