AP: గత పాలకులు 3 రాజధానుల పేరిట అసలు రాజధానే లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. ‘రాజధాని ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి అంటూ ఎన్నో రకాల అసత్యాలు ప్రచారం చేశారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేయాలని ఆలోచించా. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసం జరిగింది.. బ్రాండ్ నష్టపోయింది’ అని ఆయన తెలిపారు.