VSP: విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తదితర అధికారులు పాల్గొన్నారు.