మహారాష్ట్ర(Maharashtra)లో షాకింగ్ ఘటన జరిగింది.కిచిడి కోసం టీచర్, వంటమనిషి పొట్టు,పొట్టు కొట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధరూర్ తాలూకాలోని జోడు హింగాని ప్రభుత్వ పాఠశాల (Govt School) లో ఈ ఘటన చోటుచేసుకుంది.వండిన కిచిడి (Khichdi) నాణ్యంగా లేదంటూ టీచర్ వంట మనిషితో అన్నది. అంతేకాకుండా స్కూల్ ఆవరణలో వంట మనిషి భర్త ఒక షాప్ పెట్టడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో స్కూల్లోనే జుట్లు జుట్లు పట్టుకొని విపరీతంగా కొట్టుకున్నారు. నువ్వెవరు నన్ను అడగడానికి అంటూ టీచర్ (Teacher) పై విపరీతంగా గొడవకు దిగింది.
దీంతో ఇద్దరు కలిసి జుట్లు, జుట్లు పట్టుకోని తన్నుకున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉన్నారు.స్కూల్ ఆవరణలోనే పిల్లల ముందే వారిలా కొట్టుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. టీచర్, వంట మనిషి(Cook) జట్లు పట్టుకుని కొట్టుకోవడాన్ని చూసి పిల్లలు భయపడిపోయారు. ఇంతలో అక్కడే ఉన్న మహిళలు అతి కష్టం మీద వారిద్దరినీ విడదీశారు. ఇద్దరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా.. అది స్కూల్ అన్న సంగతిని, అక్కడ పిల్లలున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ ఇలా దిగజారిపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.
बीड जिल्ह्यातल्या धारूर मधील हिंगणी येथील जिल्हा परिषद शाळेतील घटना आहे. खाऊ का चांगला बनवला नाही अशी विचारणा करणाऱ्या शिक्षिकेला खाऊ बनवणाऱ्या महिलेकडून मारहाण करण्यात आलीय…