ముఖ్యమంత్రి కేసీఆర్ పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (MP Komati Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు కురిపించారు. సీఎం మాత్రం మహారాష్ట్ర(Maharashtra)లో జాతీయ రాజకీయాల పేరుతో తిరగుతున్నారని ఫైర్ అయ్యారు.భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, సామాన్య ప్రజలను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు (Congress leaders) భవన్లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు.అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.దొరల పాలనలో రైతులకు మిగిలిందీ ఏమీ లేదని దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలన్నారు.సీఎం కేసీఆర్ (CMKCR) రైతు హంతకుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంరక్షణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని, ప్రకృతి విపత్తు పై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ (RTC) ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు.