సీఎం కేసీఆర్పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఫైర్య్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములను బలవంతంగా గుంజుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real estate business) చేయాడం దుర్మార్గమని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సీఎం కేసీఆర్ (CMKCR) మాట్లాడటం లేదని ప్రశ్నించారు. డిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam),పేపర్ లీకేజీ, భూ కబ్జాలు పై ఎందుకు మాట్లాడరని ఆయన అన్నారు. గ్రామ పంచాయితీ కార్మికులు 30 రోజులుగా ధర్నా చేస్తుంటే కేసీఆర్ ఎందుకు పట్టించుకుంటలేరని గరం అయ్యారు.
గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు గుంజుకొని వాటీలో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు (Dumping yards) కడుతున్నారని ఆర్ఎస్పీ విమర్శించారు. కేసీఆర్, కవిత, కేటీఆర్ (KTR) ఫామ్ హౌజ్ లలో డంపింగ్ యార్డులు స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకొని అల్లకల్లోలం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బహుజనవాదం బలపడడంతో కేసీఆర్ కుట్రలతో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Chandrasekhar Azad) ను నార్త్ ఇండియా నుంచి అరువుకు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ (Prakash Ambedkar) ను తీసుకువచ్చి, దళితులకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.