Do you see Jagan.. This is the reason for the slapped TDP councillor.
TDP: అనకాపల్లి జిల్లాలో గల నర్సీపట్నం (Narsipatnam) పురపాలిక సభ్యుల సమావేశం రసాభాసాగా సాగింది. టీడీపీ కౌన్సిలర్ రామరాజు తన చెప్పుతో కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీటింగ్లో పాల్గొన్న కౌన్సిలర్.. తాము ఎన్నికై దాదాపు 3 సంవత్సరాలు గడిచినప్పటికీ తన సొంత వార్డులో అభివృద్ది పనులు ఏం జరగలేదని, కనీసం తాగునీటి కొళాయి కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక క్రమంలో చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో నిధులు అందించడం లేదని, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల విషయంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో తన చెప్పుతో తానే కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్ రామరాజు.