తెలంగాణ (Telangana) విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ విద్యార్థి సంఘాలను స్కూలులోకి అనుమతించవద్దని డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేవ ఉత్వర్వులు జారీ చేశారు. జిల్లాల విద్యాశాఖ (Department of Education) ఆఫీసర్లతో స్కూల్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ (Video conference) నిర్వహించారు. ఒకవేళ విద్యార్థి సంఘం నాయకులెవరైనా పాఠశాలకు వచ్చినట్లు తెలిస్తే ఆ బడి ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై హెచ్ఎం (HM) పూర్తి బాధ్యతలు వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రభుత్వ పాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ(KGBV)లకు ఈ నిబంధన వర్తిస్తుందని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపినట్లు డీఈఓ(DEO)లు స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛంధ సంస్థలు, విద్యా సంఘాలు, పార్టీలు, వ్యక్తులు, ఎవరైనా కానీ ముందుగా డీఈఓ అనుమతి తీసుకోవాలని పెర్కోన్నారు.
ఇది అప్రజాస్వామికం అని, విద్యార్థి సమస్యలపై ప్రశ్నించే హక్కు తీసివేయడం సరికాదని విద్యార్థి సంఘాలు (Student Unions)తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం చాలా కష్టమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది అప్రజాస్వామికం అని, విద్యార్థి సమస్యలపై నినదించే హక్కు తీసివేయడం సరికాదని అంటున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం చాలా కష్టం అని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వారిని అడ్డుకోవడం ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు. ఇప్పటికి ఇప్పుడు నిర్బంధం విధిస్తే వారి నుంచి ప్రతిఘటన వస్తుందని.. పోలీసులు (Police) జోక్యం చేసుకుంటే మరిన్ని సమస్యలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు.