»Water Instead Of Petrol In Petrol Station Hitech City Mancherial Do You Know The Quality Of Petrol
Water instead of petrol: పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీరు..పెట్రోల్ నాణ్యత మీకు తెలుసా?
ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల(mancherial) హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ బదులుగా నీరు(Water instead of petrol) వచ్చింది. అది గమనించిన అక్కడి వినియోగదారులు బంకు సిబ్బంది మీద దాడి చేశారు. డబ్బులు తీసుకుని నాణ్యమైన పెట్రోల్ అందించ కుండా కల్తీ ఉన్నది పోస్తున్నారని వాపోయారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అసలు పెట్రోల్ నాణ్యతను ఎలా తెలుసుకోవాలి? పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు మీటర్ రీడింగ్ ఏది చూడాలనేది ఇప్పుడు చుద్దాం.
మంచిర్యాల – హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ బదులుగా నీరు వస్తుండటంతో బంకు సిబ్బంది మీద దాడి చేసిన వినియోగదారులు. pic.twitter.com/iubCoIfpt0
మీరు మీ కారు లేదా బైక్‌లో పెట్రోల్, డీజిల్ నింపించుకునేందుకు వెళ్లిన క్రమంలో కొన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే పంప్ మెషీన్ డిస్ప్లేలో సున్నాని చూడటం మర్చిపోవద్దు. దీంతోపాటు పంప్ డ్రైవర్ ఒక బటన్ నొక్కి, పెట్రోల్ కోసం రూ.100 సూచిస్తాడు. మీరు రూ.100 చెల్లించి వెళ్లిపోతారు. కానీ మీకు పెట్రోల్ తక్కువగా వచ్చిందని అనుమానం ఉంటే ఏదైనా లీటర్ బాటిల్లో(bottle) పోయమని అడగండి. అప్పుడు ఈజీగా పెట్రోల్ పోసిన పరిమాణం తెలుసుకోవచ్చు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ క్వాలిటీని కూడా మనం తెలుసుకోవచ్చు. పెట్రోల్(petrol), డీజిల్(diesel) సాంద్రతకు ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. వాటిని ఆయా పెట్రోల్ అమ్మే బంకులు తప్పనిసరిగా పాటించాలి. పెట్రోల్ సాంద్రత క్యూబిక్ మీటరుకు 730 నుంచి 800 కిలోల వరకు ఉండాలి. డీజిల్ స్వచ్ఛత సాంద్రత 830 నుంచి 900 kg/m3 మధ్య తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా పెట్రోల్ పంప్ మెషీన్ డిస్ప్లేలలో 400, 500 వంటి నంబర్లు ఉంటే అది కచ్చితంగా తక్కువ నాణ్యత కల్గినదిగా చెప్పవచ్చు. ఆ క్రమంలో వెంటనే వారిని ప్రశ్నించాలి. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్ పోయడం లేదని ఫిర్యాదు చేయాలి. ఈ సమాచారం పెట్రోల్ నింపే యంత్రం డిస్ప్లేలో ఉంటుంది. అంతేకాదు పెట్రోల్ రసీదుపై కూడా పెట్రోల్ సాంద్రత రాసి ఉంటుంది. మీరు దీనితో సంతృప్తి చెందకపోతే పంపులో అందుబాటులో ఉన్న డెన్సిటీ జార్‌తో మీరు దాన్ని తనిఖీ చేసి కంప్లైంట్ చేయవచ్చు.