»Two Morning Walkers Killed In A Sports Bike Collision In Hyderabad Bolarum
Hyderabad:లో స్పోర్ట్స్ బైక్ ఢీకొని ఇద్దరు మార్నింగ్ వాకర్స్ మృతి
హైదరాబాద్‌లో మీరు మార్నింక్ వాక్ కోసం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. కానీ పార్క్ బయట పరిసరాల్లో మాత్రం వాకింగ్ చేయకండి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే జులై 4న మార్నింగ్ వాకర్స్ ను ఓ కారు ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓ స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి ఇద్దరు మహిళలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కూడా మృత్యువాత చెందారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్(hyderabad)లోని బొల్లారం(bolarum)లో తెల్లవారుజామున 5 గంటలకు మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన ఇద్దరు మహిళలను వేగంగా వచ్చిన స్పోర్ట్ బైక్(sports bike) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందారు. మృతులు రిసాల బజార్లో నివాసం ఉంటున్న రాధిక (48), కళాసిగూడకు చెందిన బాలమణి యాదవ్ (60)గా గుర్తించారు. వీరిద్దరూ చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డ్ పార్క్ సమీపంలో మహిళలు మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
అయితే ఉప్పల్(uppal)లో నివాసముంటున్న ఐటీ ఉద్యోగి ఆదిత్య(32) అనే యువకుడు శామీర్‌పేట వైపు అతివేగంతో 900 సీసీ స్పోర్ట్ బైక్(sports bike) పై వెళుతూ వారిని ఢీకొట్టాడు. దీంతో వారి ఇద్దరి తలకు బలమైన గాయాలు అయ్యాయి. అయితే రాధిక అక్కడికక్కడే మృతి చెందగా, 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా బాలమణి యాదవ్ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆదిత్యపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మార్నింగ్ వాకర్స్(morning walkers) మృతి చెందడం హైదరాబాద్‌లో ఇది రెండో ఘటన. జూలై 4న సన్ సిటీలో వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఓ మహిళ, ఆమె కుమార్తె మరణించారు. ఈ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ముగ్గురు వాకర్లను ఢీకొట్టి నేలపై నుంచి వారిని విసిరిన దృశ్యాలు, కారు రోడ్డుపై నుంచి జారిపడి చెట్టును ఢీకొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. అనంతరం కారు నడుపుతున్న 19 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి తన ముగ్గురు స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకునేందుకు మొయినాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ఇది జరిగిందని పేర్కొన్నారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంతవరకు తెలియరాలేదు.