»A Volunteer Who Killed An Elderly Woman In Visakhapatnam
Volunteer: వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్!
ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ బంగారు నగలతో తీసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారికి జీతాలు సరిపోకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని పలువురు అంటున్నారు.
volunteer: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం, వృద్ధులకు చేయుతగా ఉండాలని వాలంటీర్(volunteer) వ్యవస్థ ప్రవేశపెట్టారు. గ్రామస్తులకు అండగా ఉండాల్సిన వారు ప్రజల ప్రాణాలకు గండంగా మారిన వైనం విశాఖపట్నం(Visakhapatnam)లో చోటుచేసుకుంది. ఓ వృద్దురాలి(Old Women)ని వాలంటీర్ దారుణంగా హత్య(Murder) చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సూజాతనగర్ లో ఈ అమానుషమైన ఘటనతో స్థానికుల్లో కలవరం మొదలయ్యింది. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ ఈ హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…
హత్యకు గురయిన వరలక్ష్మీ(73) అనే వృద్ధురాలు స్థానికంగా కిరాణం షాప్ నిర్వహిస్తుంది. అదే వార్డులో వాలంటీర్(volunteer)గా పనిచేస్తున్న వెంకటేష్ ఆమె వద్ద పార్ట్ టైమ్ పని చేస్తుంటాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేశాడు. అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా వరలక్ష్మీ విగతజీవిగా ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పెందుర్తి పోలీసులు(Police), క్లూస్ టీమ్(Clue team) ఘటన స్థలానికి చేరుకోని ఆధారాలు సేకరించారు. వృద్ధురాలు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు క్లూస్ టీం నిర్థారణకు వచ్చింది. ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిందుతుడు దోచుకెళ్లాడు. పోస్టుమార్టమ్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అసలే ఏపీలో వాలంటీర్ల విషయంలో రాజకీయ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు ఈ వ్యవస్థ అనవసరం అన్న వాదనతో ముందుకెళ్తున్నారు. దాన్ని ప్రతిఘటిస్తు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాలంటీర్లను వ్యవస్థ మంచిదని ప్రచరాలు చేస్తున్నారు. పీజీలు, గ్రాడ్యుయేట్లు చదివిన వారికి జీతం సరిపోకపోవడమే ఇలాంటి ఘటనలు జరగడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
చదవండి:Hyderabad:లో స్పోర్ట్స్ బైక్ ఢీకొని ఇద్దరు మార్నింగ్ వాకర్స్ మృతి