Do you know the most valuable thing that Ram Charan has?
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) సినిమా కోసం ఎంత కష్టపడుతుంటాడో మనందరికీ తెలుసు. తాను నటించే చిత్రం కోసం తనని తాను మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే నటుడు ఆయన. బయట ఎక్కడ కనిపించినా సింపుల్‌గా ఉంటూనే స్టైలిష్ దుస్తుల్లో కనిపిస్తారు. తాజాగా స్టైల్ మే రహ్నేకా (Style May Rahneka) కార్యక్రమంలో పాల్గొన్నారు. తన వార్డ్‌రోబ్‌లో అత్యంత ఖరీదైన, అతి తక్కువ ధర కలిగిన వస్తువుల గురించి వెల్లడించారు.
మీ వార్డ్రోబ్ (Wardrobe)లో అతి తక్కువ ఖరీదైన వస్తువు ఏంటి అనే ప్రశ్నకు బదులిస్తూ.. చక్రి బనియన్ అన్నారు. తన వద్ద జాకీ బనియన్ లేదని నవ్వుతూ చెప్పారు. మరి అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి అని అడగ్గా, తన చేతి వాచ్(Watch) అని చెప్పారు. దుస్తులపై తాను ఎక్కువగా ఖర్చు చేయను అంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా ఈవెంట్‌కు రామ్‌చరణ్ అతిథిగా హాజరైతే స్టైలిష్ దుస్తుల్లో కనిపిస్తారు. ఫ్యాషన్ చెప్పులు, షూలు ధరిస్తూ కనిపిస్తారు. సామాజిక మధ్యమాల్లోనూ అవి తెగ వైరల్ అవుతుంటాయి. దీనిపై కూడా చరణ్ స్పందించారు. ట్రెండ్‌కు తగినట్లు కొత్త వాటిని తాను పరిచయం చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదన్నారు. ఏదైనా కొత్త వాటిని ధరిస్తే, తన ఇంట్లో అక్క పిల్లలు ఆ స్నీకర్స్ చూసి, చరణ్ మామా అవి 1000 డాలర్ల ఉంటాయా అని అడగుతారు. కానీ తాను 250 డాలర్లకు మించి ఖర్చు చేయను అని చెప్పారు. ఎందుకంటే చెప్పులు కాలికి వేసుకుంటాం. వాటి మీద విపరీతంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అదే వాచ్‌లు చేతులకు పెట్టుకుంటాం. స్టైల్‌గానూ ఉంటాయన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (game changer)లో నటిస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. తరువాతి సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండనుంది.